: అయుత మహా చండీయాగంలో అగ్నిప్రమాదం
నాలుగు రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరిగిన అయుత మహా చండీయాగానికి చివరి రోజున పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పొద్దున్నే పొగ చూరి కాసేపు యాగానికి ఆటంకం జరుగగా, ఆపై తమ దక్షిణ కోసం రుత్వికుల ఆందోళన ముగియగా, తాజాగా ఘోరం జరిగిపోయింది. యాగశాలలో హోమగుండాల్లోని మంటలు యాగశాలను దహించివేశాయి. పైకప్పుకు నిప్పంటుకోవడంతో రుత్వికులు తలోదిక్కుకూ పరుగులు తీశారు. దీంతో అక్కడే ఉన్న రెండు ఫైరింజన్లు మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. అధికారులు మరిన్ని ఫైరింజన్లకు సమాచారం పంపారు. ఈ ప్రమాదం యాగ విరామ సమయంలో జరగడంతో ఇద్దరు ముగ్గురు రుత్వికులకు మాత్రం గాయాలైనట్టు తెలుస్తోంది.