: అయుత చండీయాగంపై అల్లాణి శ్రీధర్ డాక్యుమెంటరీ


లోకకల్యాణం కోసం, సమాజ హితాన్ని కాంక్షిస్తూ... తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగంపై ప్రముఖ దర్శక నిర్మాత, అవార్డు విన్నర్ అల్లాణి శ్రీధర్ ఒక లఘుచిత్రాన్ని రూపొందించారు. 'అద్భుత ఫలం -అయుత చండీయాగం' పేరిట దీనిని ఐదు నిమిషాల నిడివితో రూపొందించడం జరిగింది. ఇందులో అయుత చండీ యాగం విశిష్టతను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ చెబుతూ, "చంద్రుడికో నూలుపోగు అన్నట్టుగా ఈ యాగం ప్రాధాన్యతను వివరిస్తూ దీనిని రూపొందించాం. ఈ వీడియో రూపకల్పనకు ఎర్రవల్లిలో షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతీయ సంస్కృతిలో భాగమైన యజ్ఞయాగాదులపై భవిష్యత్తులో మరిన్ని డాక్యుమెంటరీలు రూపొందించే ప్రయత్నంలో దీనిని తొలిఅడుగుగా భావిస్తున్నాం" అన్నారు. ఈ డాక్యుమెంటరీని పీఠాధిపతి కమలానంద భారతి ఆవిష్కరించారు. ఇందులోని గీతాన్ని కాపర్తి రవీంద్ర రాయగా, దీనికి వరంగల్ వంశీ సంగీతాన్ని అందించారు.

  • Loading...

More Telugu News