: ఏ క్షణమైనా యూరప్ పై ఐఎస్ఐఎస్ దాడులు!
ప్రజలంతా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, యూరప్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఏ క్షణమైనా విరుచుకుపడే ప్రమాదముందని, ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఆస్ట్రేలియా భద్రతాదళ విభాగం హెచ్చరించింది. ప్రజలు, పోలీసులు నిత్యమూ జాగురూకతతో ఉండాలని సూచించింది. ఈ దాడులు బాంబులు వేయడం, ఆధునిక తుపాకులతో విరుచుకుపడటం వంటి ఎటువంటి రూపంలోనైనా ఉండవచ్చని వెల్లడించింది. ఫ్రెండ్లీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ లో భాగంగా తాము ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వ్యూహాలను తెలుసుకున్నామని తెలియజేసింది.