: గద్వాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణతో ఉద్రిక్తత!


స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కాంగ్రెస్ నేత డీకే అరుణ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వాస్తవానికి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బలమే అధికమని తెలిసి కూడా టీఆర్ఎస్ బరిలోకి దిగి తమ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ వాదనకు దిగారు. ఆపై టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టి పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపారు. మరోపక్క, దాదాపు 200 మంది అనుచరులతో నల్గొండ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్గొండలోనూ ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News