: పాస్ పుస్తకాల కేసులో విచారణకు సీఐడీ సిబ్బంది కొరత: ఏపీ డీజీపీ


ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసిన నకిలీ పాస్ పుస్తకాల కేసును సీఐడీ విభాగానికి అప్పగించబోవడం లేదని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తెలియజేశారు. ఈ కేసును విచారించేందుకు తగినంత మంది సిబ్బంది ఏపీ సీఐడీ విభాగంలో లేరని ఆయన అన్నారు. అందువల్లే కేసును సీఐడీకి బదలాయించడం లేదని, ఈ కేసులో అతి త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేస్తామని అన్నారు. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాముడు వెల్లడించారు. ఇందుకు సంబంధించి సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News