: ఐఎస్ఐఎస్ ను రూపుమాపడంలో రష్యాకు సహకరిస్తున్న తాలిబాన్లు!


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రష్యా చేస్తున్న యుద్ధానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సహకరిస్తున్నారా? అంటే, అవుననే చెబుతోంది సీఎన్ఎన్ ప్రసారం చేసిన ఓ కథనం. రష్యా విదేశీ వ్యవహారాల ప్రతినిధి మారియా జకరోవా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారట. తాము మాస్కో నుంచి ఆఫ్గన్ లోని తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారి నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అనుపానులకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారట. "ఐఎస్ఐఎస్ తో పోలిస్తే తాలిబాన్లు అంత ప్రమాదకారులు కారు. పైగా వారు సహకరిస్తున్నారు. అందువల్లే మేం వారి సాయం తీసుకుంటున్నాం. సిరియాలోని ఉత్తర కాకసుస్ ప్రాంతంలో ప్రజలు సైతం ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. వారికి కూడా సహకరిస్తున్నాం" అని మారియా వెల్లడించారు. కాగా, రష్యా సర్కారుతో తమ బంధాన్ని తాలిబాన్ వర్గాలు నిరాకరించాయి. ఈ కథనం అవాస్తవమని, తాము ఎన్నడూ రష్యాకు సమాచారం అందించలేదని, అయితే, పలు దేశాలు తమ సహకారాన్ని మాత్రం కోరుతున్నాయని స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News