: పాక్ చరిత్రలో తొలిసారి... వీసాలు లేకుండా 120 మంది భారతీయులు దర్జాగా తిరిగెళ్తారా?
పాకిస్థాన్ కు అనుకోని అతిథి రూపంలో మోదీ పర్యటించి రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించగా, ఇప్పుడు ఆయన పర్యటనపై పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎటువంటి వీసాలూ లేకుండా పెద్ద సంఖ్యలో భారతీయులు పాక్ గడ్డపై కాలు పెట్టారని, ఈ తప్పుకు ఎవరిని బాధ్యులను చేయాలని పాక్ జర్నలిస్టు ప్రశ్నిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పాక్ చరిత్రలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారని కైజర్ ఖోకర్ అనే విలేకరి వెల్లడించారు. మొత్తం 120 మంది వీసాలు లేకుండా పాక్ గడ్డపై దర్జాగా నడిచారని చెప్పారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఏజన్సీలు, ఇమిగ్రేషన్ అధికారులు ఎలా విస్మరించారని, దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రజలు కోరుతున్నారని గట్టిగా చెబుతున్న వీడియోను పాక్ జాతీయులు షేర్ మీద షేర్ చేస్తున్నారు.