: మీ పెట్టుబడి రెట్టింపు ఎప్పుడవుతుందో చెప్పే రూల్ 72!


మీరు పెట్టిన పెట్టుబడి రెండు రెట్లు ఎప్పుడవుతుంది? పెట్టుబడిపై సంవత్సరానికి ఎంత ఆదాయం లభిస్తే ఆ డబ్బు రెట్టింపవుతుందో తెలుసా? దీనికి 'రూల్ 72' సమాదానం ఇస్తుంది. లభించే వార్షిక వడ్డీతో 72ను భాగిస్తే వచ్చే సమాధానమే, డబ్బు రెట్టింపయ్యే కాలాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు... రూ. 20 వేలు పెట్టుబడిగా పెట్టి సంవత్సరానికి 10 శాతం వడ్డీ వస్తున్నదనుకోండి. అప్పుడు 72ను 10తో భాగిస్తే 7.2 వస్తుంది. కాబట్టి మీ రూ. 20 వేలు రూ. 40 వేలుగా మారడానికి 7 సంవత్సరాలా 2 నెలలు పడుతుందని అర్థం. ఎంత రాబడి పెరుగుతుంటే, అంత త్వరగా మీ డబ్బు రెట్టింపవుతుంది. సాలీనా 25 శాతం రాబడి ఉంటే 2.88 సంవత్సరాల్లో, 20 శాతం రాబడి వుంటే 3.6 సంవత్సరాల్లో, 15 శాతం రాబడి వస్తుంటే 4.8 సంవత్సరాల్లో పెట్టుబడి డబుల్ అవుతుంది. ఇండియాలోని బ్యాంకులు డిపాజిట్లపై ప్రస్తుతం 7 శాతానికి కొద్దిగా అధికంగా వడ్డీని ఇస్తున్నాయి. ఈ లెక్కన మీ డిపాజిట్ రెండింతలు కావడానికి 10 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఇక్కడ మీరు పన్ను పరిధిలో ఉంటే, పొందే వడ్డీపై 10 నుంచి 30 శాతం వరకూ పన్నులనూ చెల్లించాలని గుర్తుంచుకోవాలి.

  • Loading...

More Telugu News