: 'నా జోలికొస్తే ఇంతే' అంటూ మాజీ ఐపీఎస్ కుమార్తె హల్ చల్!


ఆమె మేఘాలయకు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుమార్తె. హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, ఎమ్మెల్యే కాలనీలోని శాంతి నివాస్ అపార్టుమెంటులో అద్దెకు ఉంటోంది. వచ్చిన రోజు నుంచి మిగతా ఫ్లాట్ల వారితో గొడవలు పెట్టుకుంది. అపార్ట్ మెంట్ యజమాని నుంచి ఫ్లాట్ల ఓనర్లు, కిరాయికి ఉండే వారిపై కేసులు పెట్టింది. తాజాగా తను చేసిన పనితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని చెబుతూ, ఓ పావురాన్ని చంపి, తన అపార్టు మెంటు ముందు వేల్లాడదీసింది. ఇదేం పనని ప్రశ్నించిన ఇరుగు, పొరుగు వారిపై విరుచుకుపడింది. తనకు ఎదురొస్తే ఎంతకైనా తెగిస్తానని ఆమె భయపెడుతోందని చెబుతూ, పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పావురాన్ని చంపి వేళాడదీసిన ఘటన గురించి తెలుసుకున్న పెటా కార్యకర్తలు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News