: మోదీ పాక్ పర్యటన వెనుక ప్రైవేటు వ్యాపారాలు... జిందాల్ ఉండటంపై మండిపడుతున్న కాంగ్రెస్!


అందరినీ ఆశ్చర్య పరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లో పర్యటించిన వేళ, ఉక్కు దిగ్గజం సజ్జన్ జిందాల్ అక్కడే ఉండటంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మోదీ పర్యటన అనుకోకుండా జరిగింది కాదని, ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారని, ఆ ఏర్పాట్లను జిందాల్ దగ్గరుండి పర్యవేక్షించారని మాజీ వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రైవేటు వ్యాపార ప్రయోజనాలను చక్కదిద్దుకునేందుకే మోదీ పాక్ వెళ్లారని మండిపడ్డారు. ప్రధాని హోదాలో పాక్ కు వెళ్లిన ఆయన ముంబై దాడుల సూత్రధారుల అప్పగింత, ఉగ్ర అనుకూల కార్యకలాపాల నిలిపివేత వంటి అంశాల్లో ఒక్కదానిపైనైనా హామీని పొందారా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ విమర్శలు అర్థరహితమని బీజేపీ వ్యాఖ్యానించింది. ప్రొటోకాల్ రాజకీయాలకు చరమగీతం పాడిన అద్భుత అడుగు ఇదని అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్యా శాంతి వెల్లివిరిసేందుకు మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని శివసేన పేర్కొంది.

  • Loading...

More Telugu News