: మహాచండికి పూర్ణాహుతిలో 101 కంచి పట్టు చీరలు, 12 టన్నుల పాయసం


నేడు ముగియనున్న అయుత మహా చండీయాగంలో అత్యంత కీలకమైన పూర్ణాహుతికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 101 హోమ గుండాల ముందు 11 మంది రుత్వికుల చొప్పున కూర్చొని యాగాన్ని ముగించనున్నారు. కంచి నుంచి తెప్పించిన 101 పట్టు చీరలు, 2 టన్నుల వరకూ ప్రత్యేకంగా తయారు చేయించిన పసుపు, కుంకుమలను మహా చండీదేవికి నైవేద్యంగా సమర్పించనున్నారు. 12 టన్నుల పాయసాన్ని సైతం పూర్ణాహుతిలో వినియోగించనున్నారు. ప్రతి యజ్ఞగుండం ముందు ఐదు కిలోల ఆవునెయ్యి, పది డజన్ల అరటిపళ్లు ఇతర పూజా ద్రవ్యాలను సిద్ధం చేశారు. సంపూర్ణ పూర్ణాహుతిలో సమర్పించే వస్తువులు, ఆహార పదార్థాలు పూర్తిగా ఆహుతి అయ్యేలా భారీగా మోదుగ పుల్లలను సిద్ధం చేశారు. మరో గంటలో తుది ఘట్టం మొదలు కానుంది.

  • Loading...

More Telugu News