: ఆ పాటలో అసభ్యతేముంది?... శింబు పాటను తొలగించేందుకు యూట్యూబ్ నిరాకరణ
తమిళనటుడు శింబు పాడగా, కలకలం సృష్టించిన బీప్ సాంగ్ ను తొలగించేందుకు యూట్యూబ్ నిరాకరించింది. నవంబర్ 11న ఈ పాట యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, ఇప్పటికే దీన్ని 10 లక్షల మందికి పైగా వీక్షించారు. బీప్ సాంగ్ పై రాద్ధాంతం పెరుగుతుండటంతో, ముందుగా సామాజిక మాధ్యమాల నుంచి దీన్ని తొలగించాలని భావించిన చెన్నై పోలీసులు యూట్యూబ్ ను సంప్రదించి ఈ సాంగ్ ను తీసివేయాలని కోరారు. తమకు ఆ పదాల అర్థం ఏమిటో ఆంగ్లంలోకి అనువదించి చెప్పాలని యూట్యూబ్ కోరగా, పోలీసులు ఆ పని పూర్తి చేశారు. బీప్ సాంగ్ లోని పదాలు అభ్యంతరం కాదని, అసభ్యత లేదని చెప్పిన యూట్యూబ్ అధికారులు, దాన్ని తీసివేయలేమని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక, ఇక ఈ పాటను ఎవరు అప్ లోడ్ చేశారన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు కదిలారు.