: యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు ఐఎస్ బెదరింపు కాల్!


యూపీ ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ కు ఐఎస్ నుంచి బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. తనను చంపేస్తామని ఆ ఫోన్ కాల్ లో ఒక వ్యక్తి బెదరించాడని ఆయన చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ అమెరికా నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ చేసిన వ్యక్తి హిందీ భాషలో మాట్లాడాడని, తాను ఫోన్ కట్ చేయగా, మళ్లీ ఫోన్ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్ కు చేరుకున్నారని, తనను చంపేస్తారని బెదిరించినట్లు తెలిపారు. కాగా, ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేతలకు, ఐజీకి తెలియజేసినట్లు సంగీత్ సోమ్ చెప్పారు.

  • Loading...

More Telugu News