: తిరుమలలో ఏకాదశి పాసులు ఇప్పిస్తామంటూ మోసం!


తిరుమలలో ఏకాదశి పాసులు ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి మోసానికి పాల్పడుతూ, భక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. టీటీడీ పాలకమండలి సభ్యుడి వద్ద పీఆర్వోగా పని చేస్తున్న మంజునాథ్ అనే వ్యక్తి, బెంగళూరుకు చెందిన భక్తులకు ఏకాదశి పాసులు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అందునిమిత్తం వారి వద్ద నుంచి సుమారు రూ.1.10 లక్షలు వరకు వసూలు చేశాడు. కానీ, వారికి పాసులు ఇప్పించలేదు. దీంతో సదరు బాధితులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి, మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇతనిపై కేసు నమోదు చేయవద్దని టీటీడీ విజిలెన్స్ పై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News