: ఒవైసీ కుటుంబానిది అసలు హైదరాబాదే కాదు: వీహెచ్


ఎంఐఎం పార్టీ మీద, ఒవైసీ కుటుంబం మీద కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఎంఐఎం ఒక అవకాశవాద పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో లాభపడి... ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరిందని విమర్శించారు. దారూసలాంతో పాటు ఒవైసీ కుటుంబానికి పలు విద్యా సంస్థలు కాంగ్రెస్ పార్టీ వల్లే సమకూరాయని చెప్పారు. పేద ముస్లింలకు ఇప్పటిదాకా ఎంఐఎం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా ఎంఐఎం ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. అసలు ఒవైసీలది హైదరాబాదే కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News