: మెట్లకు నివాళి అర్పించిన చంద్రబాబు
మాజీ మంత్రి, టీడీపీ నేత మెట్ల సత్యనారాయణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సాయంత్రం అమలాపురంలో జరిగిన మెట్ల అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మెట్ల సత్యనారాయణ భౌతికకాయాన్ని కడసారి దర్శించుకుని, ఘన నివాళి అర్పించారు. అంత్యక్రియల అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి మెట్ల సత్యనారాయణ అని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వ్యక్తి అని చెప్పారు. ఆయన సేవలను టీడీపీ ఎన్నటికీ మరిచిపోదని తెలిపారు.