: కొత్త సంవత్సర వేడుకలపై సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలను నిర్వహించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ ఆనంద్ తెలిపారు. డీజేని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే చోట కపుల్స్ ను మాత్రమే అనుమతించాలని చెప్పారు. హోర్డింగులు, పేపర్లలో అశ్లీల ఫొటోలు, అర్ధనగ్న ఫొటోలు నిషిద్ధమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు తెగబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటీ పరిధిలోని 25 స్టార్ హోటళ్లు, 269 ఫామ్ హౌస్ లు, 22 రిసార్ట్స్, 3 పబ్బులపై నిఘా పెట్టామని చెప్పారు.