: చంద్రబాబును కలిసిన అనిల్ అంబానీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం చంద్రబాబును కలుసుకునేందుకు వెళ్లిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. సుమారు అరగంట సేపు వీరు సమావేశమయ్యారని, ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారని సమాచారం. రాష్ట్రంలో 4జీ సేవలు, గ్రామాలకు సాంకేతికత అనుసంధానంపై చర్చించారు. అనంతరం అనిల్ అంబానీ తిరిగి పయనమయ్యారు.