: ఏపీ, తెలంగాణలో అతిశీతల గాలులు... మరో పది రోజులు భరించాల్సిందే
ఇరు తెలుగు రాష్ట్రాల్లో అతి శీతల గాలులు వీస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న ఈ గాలుల ప్రభావంతో, ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. మరో పది రోజుల పాటు ఈ శీతల గాలులు ఇలాగే వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 30వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.