: జనవరి 1న ఇద్దరు ‘వీరప్పన్’లు రిలీజ్!


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం జనవరి 1వ తేదీన విడుదల కానుంది. అయితే, అదే రోజున వీరప్పన్ జీవిత కథతో రూపొందించిన మరో చిత్రం కూడా రిలీజ్ కానుంది. 2013లో దక్షిణాది నటుడు అర్జున్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పేరు 'వనయుద్ధం'. అయితే ఆ చిత్రం పేరును ‘వీరప్పన్’ గా మార్చి జనవరి 1వ తేదీనాడే రిలీజ్ చేయనున్నారు. అంటే.. జనవరి 1న ‘వీరప్పన్’ చిత్రాలు రెండు విడుదల కానున్నాయి. మరి, ఈ ఇద్దరు ‘వీరప్పన్’లలో ఎవరు నెగ్గుతారో, ప్రేక్షకులకు ఎవరు దగ్గరవుతారో తెలియాలంటే ఆరు రోజులు వేచి చూడాల్సిందే. వర్మ తన సినిమా కోసం చేసుకుంటున్న ప్రచారం పరోక్షంగా తమ సినిమాకు కూడా ఉపయోగపడుతుందని అర్జున్ హీరోగా రానున్న 'వీరప్పన్' చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

  • Loading...

More Telugu News