: అజంఖాన్ ఓ టెర్రరిస్ట్, జాతి వ్యతిరేకి: సాధ్వీ ప్రాచి
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన వీహెచ్ పీ మహిళా నేత సాధ్వీ ప్రాచి మరోసారి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ పై నిప్పులు చెరిగారు. అజంఖాన్ ఓ టెర్రరిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక జాతి వ్యతిరేకి అని ఆరోపించారు. ప్రధాని కావాలని అజంఖాన్ కలలు కంటున్నారని... ప్రధాని కాదుకదా, ఆయన దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా కాలేడని ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే పునాది వేశామని, త్వరలోనే నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.