: చండీయాగానికి భారీగా తరలివస్తున్న ప్రజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో, యాగాన్ని ప్రజలు వీక్షించడానికి కొత్తగా మరో రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ కారణంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా ఆపి వేశారు. మరోవైపు, పోలీసు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. యాగాన్ని వీక్షించడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అసౌకర్యం కలగకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.