: భయాన్ని పోగొట్టుకునేందుకు బంగీజంప్ చేస్తున్న అజయ్ దేవగణ్
ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ బంగీజంప్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సరదా కోసం కాదు, భయాన్ని పోగొట్టుకోవడానికట. తన సాధన వెనకున్న కారణమేమిటో ట్విట్టర్ ద్వారా ఆయనే తెలిపాడు. ఆయనకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయమట. అందుకే, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి బంగీజంప్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతేకాదు, మనకు ఏదంటే భయమో దాన్నే ముందు సాధన చేయాలని కూడా సూచించాడు. ఇలా చేస్తే భయం పోతుందా మరి? అంటూ అభిమానులను కూడా ప్రశ్నించాడు.