: ఎయిరిండియా విమానాల్లో ఇకపై శాకాహారమే!


విమానయాన సంస్థ ఎయిరిండియా ఇకపై తమ ప్రయాణికులకు శాకాహార వంటకాలను మాత్రమే అందించనుంది. కొత్త ఏడాది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎయిరిండియా జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. మరోవైపు, ప్రయాణ నిడివి 60 నిమిషాలు మించినప్పుడే ఆహారాన్ని అందించనున్నారు. ప్రయాణ నిడివి అంతకన్నా తక్కువగా ఉంటే ఫుడ్ సర్వ్ చేయడానికి వీలుకాదని... అలాంటి పరిస్థితుల్లో వెజిటబుల్ రిఫ్రెష్ మెంట్లను అందిస్తామని ఎయిరిండియా తెలిపింది. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు బ్రేక్ ఫాస్ట్ తో మొదలు డిన్నర్ వరకు ఐదు కేటగిరీలతో మెనూ ఉంటుంది.

  • Loading...

More Telugu News