: బాబ్రీ మసీదు కూల్చివేతలో అందరి పాత్ర ఉంది ... సైన్యం కూడా చూస్తుండిపోయింది!: ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్య


వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ మరో బాంబు పేల్చారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు అందరూ కలిసి కుట్ర పన్నారని ఆయన కొద్దిసేపటి క్రితం లక్నోలో వ్యాఖ్యానించారు. ఇందులో భారత సైన్యానికీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ‘‘బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అందరూ ఒక దరికి చేరారు. కుట్ర చేశారు. చివరకు సైన్యం కూడా చూస్తుండిపోయింది తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసమంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) రెండు లారీల ఇటుకలను అక్కడికి తరలించిందన్న వార్తల నేపథ్యంలో ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సైన్యం పేరును ప్రస్తావస్తూ ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News