: ముంబై వెళ్లిపోతున్నా... కేసీఆర్, మెగా ఫ్యామిలీపై ట్వీట్లను మిస్ అవుతా: వర్మ
_6425.jpg)
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి మళ్లీ ముంబై వెళ్లిపోతున్నాడు. గత కొంత కాలంగా సౌత్ ఇండస్ట్రీ మీద దృష్టి సారించిన వర్మ... వరుసగా పలు సినిమాలను తెరకెక్కించాడు. ఇక్కడ బోర్ కొట్టిందో లేక ముంబై ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం అందిందో తెలియదు కానీ... వర్మ మళ్లీ బాలీవుడ్ కి చెక్కేస్తున్నాడు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా తర్వాత ముంబై వెళ్లి పోతున్నానని తాజాగా ట్వీట్ చేశాడు. తాను ముంబై వెళ్లిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, మెగా ఫ్యామిలీపై ట్వీట్లను మిస్ అవుతానంటూ ట్విట్టర్లో తెలిపాడు.