: మన్మోహన్ కలను సాకారం చేసిన మోదీ!


ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆకస్మికంగా లాహోర్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు గంటలకు పైగా అక్కడ గడిపి రాత్రికి ఢిల్లీ చేరుకోవటంపై సర్వత్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ పర్యటనతో మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలను సాకారం చేశారు. "అమృత్ సర్ లో అల్పాహారం, లాహోర్ లో మధ్యాహ్న భోజనం, కాబూల్ లో రాత్రి విందు చేయాలి. మా పూర్వీకులు అలా జీవించారు... నా మనవళ్లూ అలా జీవించాలన్నదే నా కల"... 2007 జనవరిలో ఢిల్లీలో జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో మన్మోహన్ అన్న మాటలివి. అయితే,అది ఆయనకు సాధ్యం కాకపోయినప్పటికీ, మోదీ ఇప్పుడు దానిని సుసాధ్యం చేశారు. కాకుంటే, ఇటునుంచి అటువైపు కాకుండా, అటునుంచి ఇటువైపుగా ఇది సాగింది. చివర్లో అమృత్ సర్ స్థానంలో ఢిల్లీ చేరింది. నిన్న (శుక్రవారం) ఉదయాన్నే మాస్కో నుంచి కాబూల్ చేరిన మోదీ.. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో అల్పాహారం చేశారు. సాయంత్రం లాహోర్ చేరుకుని అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన నివాసంలో ఇచ్చిన విందును స్వీకరించారు. ఇక రాత్రి వేళకి ప్రధాని ఢిల్లీ చేరుకున్నారు. దాంతో ఒకేరోజు మూడు పూటలను మూడు దేశాల్లో గడిపిన ఘనతను సుసాధ్యం చేశారు.

  • Loading...

More Telugu News