: జూన్ లోపు ఏపీ సచివాలయాన్ని విజయవాడకు తరలించాలి: చంద్రబాబు


నవ్యాంధ్ర సచివాలయాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్మించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లోపు రాష్ట్ర సచివాలయాన్ని విజయవాడకు తరలించాలని అధికారులకు సూచించారు. సచివాలయ భవన నిర్మాణం కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని సమకూర్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 12.43 లక్షల రేషన్ కార్డులను అర్హులకు అందజేయాలని సూచించారు. జిల్లాకు లక్ష చొప్పున అన్ని జిల్లాల్లో నీటికుంటల నిర్మాణం చేపట్టాలన్నారు. రోజుకు 5 కిలో మీటర్ల చొప్పున 90 రోజుల్లో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News