: దేవినేని నెహ్రూ!... నా సహనాన్ని చేతకాని తనంగా భావిచవద్దు!: వంగవీటి రాధా వార్నింగ్


విజయవాడ రాజకీయం మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూపై దివంగత వంగవీటి రంగా కుమారుడు, వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన తండ్రిపై పిచ్చి వాగుడును నెహ్రూ మానుకోవాలని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నారని మండిపడ్డారు. కనుసైగలతో రాజకీయం చేస్తున్నట్టు... ఇంట్లో కూర్చొని పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. నెహ్రూ వల్లే తమ కుటుంబం నష్టపోయిందని... అయినా, ఎవరికీ నష్టం కలగకూడదనే తాము సైలెంట్ గా ఉన్నామని... అలా కాని పక్షంలో, తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రంగా 27వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాధా పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవినేని నెహ్రూపై ఫైర్ అయ్యారు.

  • Loading...

More Telugu News