: న్యూ ఇయర్ నాడు ముంబైపై దాడికి ముష్కరుల ప్లాన్?... బోటు పార్టీలను రద్దు చేసిన పోలీసులు
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మళ్లీ ఉగ్రవాదులు విరుచుకుపడనున్నారా? అది కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగానే దాడులకు పథకం రచించారా? అంటే, అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక సముద్ర మార్గాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్న నేపథ్యంలో న్యూ ఇయర్ నాడు బోటు పార్టీలను రద్దు చేశారు. ఇక ముంబై తీర ప్రాంతాన్ని నగర పోలీసులతో పాటు కోస్ట్ గార్డ్, నావికాదళం, మెరైన్ పోలీసులు జల్లెడపడుతున్నారు.