: టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆంధ్ర వారికి ఏమైనా జరిగిందా?: కేటీఆర్
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వారికి ఏదో అవుతుందనే ప్రచారం చేశారని... ఏమైనా జరిగిందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కావాలనే పనిగట్టుకుని ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఇదే సమయంలో బీజేపీ నేతలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడైనా హైదరాబాద్ కు వచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి, తెలంగాణకు లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. జమ్ము కశ్మీర్, బీహార్ లకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇచ్చినప్పుడు... తెలంగాణకు మాత్రం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.