: నాగపూర్ లో ముగ్గురు హైదరాబాదీ స్టూడెంట్స్ అరెస్ట్... ఐఎస్ లో చేరేందుకు వెళ్తుండగా పట్టివేత


ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళుతున్న యువకులకు అడ్డుకట్ట పడటం లేదు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నాగపూర్ లో ముగ్గురు హైదరాబాదీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు నుంచి నిన్న సాయంత్రానికి రోడ్డు మార్గం మీదుగా నాగపూర్ చేరుకున్న సదరు యువకులు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు బయలుదేరేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 20 ఏళ్ల వయస్సున్న ఆ ముగ్గురు యువకులదీ హైదరాబాదేనట. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సదరు యువకులు ఐఎస్ లో చేరేందుకే ఆఫ్ఘనిస్థాన్ బయలుదేరారు. తమ పిల్లల ఆచూకీ లభించడం లేదని వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షణాల్లో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి వారిని పట్టేశారు. ఇదిలా ఉంటే, ఈ ముగ్గురు యువకుల్లోని ఇద్దరు ఇదివరకు కూడా ఓసారి ఐఎస్ లో చేరేందుకు వెళుతూ పట్టుబడినవారేనట.

  • Loading...

More Telugu News