: గవర్నర్ గారూ, ఆ రెండింటినీ తిరస్కరించండి: రఘువీరా


ప్రభుత్వ భూములను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే బిల్లు, ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును తిరస్కరించాలని గవర్నర్ నరసింహన్ ను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్ కు ఓ లేఖ రాశారు. ఈ రెండు బిల్లులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. అమరావతి భూములను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నిస్తున్నారని... అందులో భాగంగానే 99 ఏళ్ల లీజు బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లు వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News