: నాలుగో రోజుకు చండీయాగం... నేడు తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరు
విశ్వశాంతి, తెలంగాణ సస్యశ్యామలాన్ని కాంక్షిస్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం నేడు నాలుగో రోజుకు చేరుకుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ యాగాన్ని కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ యాగానికి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు హాజరవుతున్నారు. నేటి యాగానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరుకానున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ యాగం రేపటితో ముగియనుంది.