: రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు... మిగిలిన అరడజను సీట్లు కూడా ‘గులాబీ’ ఖాతాలోకే?


తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో రేపు జరగనున్న పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అధికార టీఆర్ఎస్ చక్రం తిప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆరు సీట్లు ఏకగ్రీవంగానే ఆ పార్టీ ఖాతాలో పడిపోయాయి. మిగిలిన ఆరు సీట్లకు మాత్రమే రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా ఉన్నారు. విపక్ష కాంగ్రెస్, టీడీపీలకు ఆయా స్థానాల పరిధిలో స్పష్టమైన బలమేమీ లేదు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలాగే సాగనుంది. వెరసి ఇప్పటికే అర డజను సీట్లను ఏకగ్రీవంగా దక్కించుకున్న గులాబీ దండు, మిగిలిన అర డజను సీట్లను కూడా తన ఖాతాలో వేసుకోనుంది.

  • Loading...

More Telugu News