: ఆఫ్ఘన్, పాక్ లలో భారీ భూకంపం... వణికిపోయిన ఉత్తర భారతం


ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో నిన్న రాత్రి పెను భూకంపం సంభవించింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత 6.4, 6.9 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి ఉత్తర భారతం వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా చండీగఢ్, జైపూర్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నడిరాత్రి ఉన్నట్లుండి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. తొలుత అఫ్ఘన్ లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం హిందూకుష్ పర్వతాల్లో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం కారణంగా పెద్దగా నష్టం జరిగినట్లు దాఖలా లేదు. మరికాసేపటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (ఆజాద్ కాశ్మీర్)లోనూ 6.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 30 మందికి గాయాలయ్యాయి. వీరందరికి పెషావర్ లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో పాక్ లోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News