: దేవుడు పుట్టిన చోటే శాంతి కూడా పుట్టింది: పోప్ ఫ్రాన్సిస్


దేవుడు పుట్టిన చోటే శాంతి కూడా పుట్టిందని, అలాంటి చోట ఇక విద్వేషాలకు, యుద్ధానికి చోటులేదని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. రోమ్ లోని సెయింట్ పీటర్ స్క్వేర్ వద్దకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి పోప్ తన సందేశాన్ని ఇచ్చారు. పవిత్రమైన భూమితో పాటు ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని అన్నారు. కానీ, ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు ఈ ప్రపంచంలో కొనసాగుతున్నాయని.. శాంతి స్థాపనకు అందరూ పూనుకోవాలని పోప్ కోరారు. ఈ సందర్భంగా శాంతిని నెలకొల్పడానికి గల మార్గాలను కూడా ఆయన సూచించారు. ఇజ్రాయెలీ, పాలస్తీనా దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఘర్షణకు ఓ పరిష్కారాన్ని కనుగొనాలని పోప్ సూచించారు.

  • Loading...

More Telugu News