: రజనీకాంత్, అమీ జాక్సన్ ల క్రిస్మస్ సంబరం!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్ జంటగా తెరకెక్కుతున్న ‘రోబో’ సీక్వెల్ రోబో 2.0 చిత్రం. చెన్నైలో ఈ చిత్రం సెట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజనీ, తాను కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసినట్లు ఆమె తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేక్ కట్ చేస్తుండగా తీసిన ఒక ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా, సంచలన దర్శకుడు శంకర్ సెన్సేషనల్ మూవీ రోబోకి సీక్వెల్ రోబో 2.0 షూటింగ్ కార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా ‘బాహుబలి’ ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు.ఈ చిత్రం లో ప్రతినాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.