: నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరైన మోదీ!


పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ జరిగిన ఒక శుభకార్యానికి కూడా హాజరయ్యారు. షరీఫ్ మనవరాలి పెళ్లి కూడా ఇదే రోజున జరుగుతుండటంతో అక్కడికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం మోదీ, షరీఫ్ కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్ నగర శివారు రాయ్ విండ్ లోని పాక్ ప్రధాని నివాసానికి వెళ్లారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. రాయ్ విండ్ లోని షరీఫ్ నివాసంలో ఆయన మనవరాలి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి హాజరైన అనంతరం, షరీఫ్‌ నివాసంలో రెండు దేశాల ప్రధానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News