: చనిపోయిన పెంపుడు శునకం క్లోనింగ్ కోసం రూ. 1.32 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్ బిలియనీర్


అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు చనిపోయిన సమయంలో వాటి యజమానులు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇదే బాధను అనుభవించిన బ్రిటన్ జంట లారా జాక్వెస్, రిచర్డ్ రెమ్డోలు అచ్చం తమ పెంపుడు కుక్క మాదిరిగానే ఉండే క్లోనింగ్ శునకాన్ని తయారు చేయించుకున్నారు. అందుకు వారు పెట్టిన ఖర్చు రూ. 1.32 కోట్లు మాత్రమే. తమ ఎనిమిదేళ్ల శునకం డైలన్ గుండెపోటుతో మరణించడంతో, దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ సోవమ్ ను వారు ఆశ్రయించారు. డైలన్ డీఎన్ఏను సేకరించిన సోవమ్ సంస్థ సైంటిస్టులు దాన్ని అదే జాతికి చెందిన మరో శునకం అండంలో ప్రవేశపెట్టి, డైలన్ వంటి రెండు కుక్క పిల్లలను లారా, రిచర్డ్ జంటకు అందించారు. ఇప్పుడా కుక్క పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నారు. అన్నట్టు బ్రిటన్ లో క్లోనింగ్ ద్వారా కుక్క పిల్లలను పొందిన తొలి జంట వీరిదేనట!

  • Loading...

More Telugu News