: శ్రీలంక క్రికెటర్ పెరీరాపై నాలుగేళ్ల నిషేధం


శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరాపై ఐసీసీ నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. నిషేధిత ఉత్ప్రేరకాలను (డ్రగ్స్) తీసుకున్నట్టు పరీక్షల్లో తేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి దయశిరి జయశేఖర తెలిపారు. కతార్ లో పెరీరా యురీన్ శాంపిల్ ను టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. డోప్ టెస్టులో పట్టుబడ్డ రెండో శ్రీలంక క్రికెటర్ పెరీరా. అంతకు ముందు ఉపుల్ తరంగా కూడా 2011 ప్రపంచ కప్ సందర్భంగా డోప్ టెస్టులో దొరికి పోయి, మూడు నెలల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, పెరీరా సస్పెన్షన్ ను అప్పీల్ చేస్తామని దయశిరి తెలిపారు.

  • Loading...

More Telugu News