: క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల్లోని సీఎస్ఐ చర్చికి జగన్ కుటుంబసమేతంగా వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్, తల్లి విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, కరుణతో కూడుకున్న క్రీస్తు బోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు.