: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఆహ్వానిస్తాం: కిషన్ రెడ్డి


జనవరిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిదే విజయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల జరిగిన గందరగోళంపై కిషన్ పరోక్షంగా స్పందిస్తూ, చట్టసభల్లో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని అన్నారు. కిషన్ రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News