: అలనాటి బాలీవుడ్ అందాల నటి సాధన కన్నుమూత


అలనాటి నటి, ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన బాలీవుడ్ నటి సాధనా శివదాసానీ కొద్ది సేపటి క్రితం మరణించారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో ఇటీవల అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్న ఆమెకు, ఆపై నోటి పుండ్ల నుంచి తీవ్ర రక్తస్రావం అయినట్టు తెలుస్తోంది. 1960, 70 ప్రాంతాల్లో ఆమె నటించిన మేరే మెహబూబ్, మేరా సాయా, వఖ్త్ చిత్రాలు సూపర్ హిట్ అయి ఆమెను టాప్ హీరోయిన్ గా మార్చాయి. గత కొంతకాలం నుంచి ఆనారోగ్య సమస్యలు పెరగడంతో ఆమె బయట కనిపించడం మానేశారు. సాధన చివరిగా మే నెలలో జరిగిన షైనా ఎన్సీ ఫ్యాషన్ షోలో పాల్గొని నటుడు రణబీర్ తో కలసి ర్యాంప్ పై నడిచారు. సాధన నట వారసత్వాన్ని బాలీవుడ్ నటుడు ఆఫ్తాబ్ శివదాసానీ స్వీకరించాడు. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News