: దేశంలో ఈరోజు రెండు పండుగలు జరుగుతున్నాయి: దత్తాత్రేయ
హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 91వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఈరోజు రెండు పండుగలు జరుగుతున్నాయని... ఒకటి వాజపేయి బర్త్ డే, రెండు క్రిస్మస్ అని పేర్కొన్నారు. ఆయనొక అజాత శత్రువు అని కొనియాడారు. ఆయన పరిపాలన అందరికి ఆదర్శమని అన్నారు. ముఖ్యంగా సుపరిపానలకు వాజపేయి పాలన నిదర్శనం అని కీర్తించారు. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోపై దత్తాత్రేయ విమర్శలు చేశారు. మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. వాజపేయి హయాంలోనే మెట్రోకు రూపకల్పన జరిగిందని చెప్పారు.