: దడ పుట్టిస్తున్న చికెన్... రూ. 200 దాటిన రేటు
క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి గిరాకీని చికెన్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటి దాకా కేజీ రూ. 160 ఉన్న స్కిన్ లెస్ చికెన్ ధర అమాంతం పెరిగింది. రూ. 45 వరకు పెరిగి కేజీ రూ. 205 వరకు చేరింది. డ్రెస్డ్ చికెన్ రేటు రూ. 175కి పెరిగింది. సోమవారం నుంచి చికెన్ రేటు డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. దీంతో, చికెన్ షాపుల వైపు చూడ్డానికే సామాన్యులు భయపడుతున్నారు. మరోవైపు, చికెన్ తో పాటే కోడి గుడ్లు, మటన్ రేట్లు కూడా పెరిగాయి. అయితే, ఈ సీజన్ లో రేట్లు పెరగడం సహజమేనని... సంక్రాంతి వరకు ధరలు అస్థిరంగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.