: పశ్చిమ గోదావరిలో టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించిన రాష్ట్రపతి
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో నిర్మించిన టీటీడీ వేద భవన సముదాయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని టీటీడీ నిర్మించింది. తరువాత వేదపాఠశాల విద్యార్థులతో రాష్ట్రపతి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, పలువురు ఏపీ ఎంపీలు, టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.