: జూన్ నాటికి తెలంగాణలో కొత్త జిల్లాలు: ఈటల
2016 జూన్ నాటికి తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని టీఎస్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండంను జిల్లా చేయాలనే డిమాండ్ ఉందని... జిల్లా కావడానికి ఆ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమైనదని చెప్పారు. ఎవరికీ బాధ కలగని రీతిలో జిల్లాల ఏర్పాటు ఉంటుందని తెలిపారు.