: సీడీల విడుదలపై స్పీకర్ ను ఎందుకు అడగాలి?: చీఫ్ విప్ కాల్వ
_2738.jpg)
ఏపీ అసెంబ్లీలో ఈ వారం ప్రారంభంలో జరిగిన గొడవకు సంబంధించిన సీడీల విడుదలలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఎంతమాత్రమూ సంబంధం లేదని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన అనుమతితో తాము సీడీలను పొందామని, వాటిని విడుదల చేయాలా? వద్దా? అన్న విషయమై ఎందుకు అడగాలని ఆయన ప్రశ్నించారు. సీడీలను మీడియాకు ఇవ్వాలని స్పీకర్ తమకు చెప్పలేదని, జరిగిన విషయం ప్రజలకు తెలియాలనే తాము వాటిని విడుదల చేశామని తెలిపారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జరిగిన గొడవపై మాట్లాడకుండా, సీడీలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? స్పీకర్ పర్మిషన్ తోనే విడుదల చేశారా? వంటి అడ్డమైన ప్రశ్నలను వైకాపా వేస్తున్నదని, అసలు స్పీకర్ పర్మిషన్ అవసరం ఏముందని అన్నారు. సీడీలను తమ వద్ద దాచుకునేందుకు తెచ్చుకోలేదని, వాటిని విడుదల చేసే ఉద్దేశంతోనే తెచ్చామని తెలిపారు.