: ఇక పైరసీ వంతు... బెజవాడలో పైరసీ సీడీల ముఠా పట్టివేత


నవ్యాంద్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ నేరాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాలు వెలుగుచూడగా... తాజాగా పైరసీ సీడీల తయారీకి నగరం అడ్డాగా మారిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చలన చిత్రాలతో పాటు పలు భారతీయ భాషలకు చెందిన సినిమాలను పైరసీ చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలో పైరసీ సీడీల తయారీపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నేటి ఉదయం మెరుపు దాడి చేశారు. దాడిలో భాగంగా వందలాది తెలుగు చిత్రాలకు చెందిన వేలాది పైరసీ సీడీలు లభ్యమయ్యాయి. అధునాత టెక్నాలజీని వినియోగిస్తూ క్షణాల్లో సీడీలను తయారుచేస్తున్న ఈ ముఠా సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా ఏదేనీ చిత్రం రిలీజైన తర్వాత పైరసీ సీడీలు బయటకు రావడం మనకు తెలిసిందే. కానీ ఈ ముఠా సినిమాలు విడుదల కాకముందే పైరసీ సీడీలను మార్కెట్లోకి తీసుకువస్తున్న వైనంపై పోలీసులే నోరెళ్లబెట్టారు.

  • Loading...

More Telugu News